వృతి శిక్షాణ కేంద్రాలు ప్రారంభం
గోదావరిఖని : సింగరేణి సేవా కమిటీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన వృత్తి శిక్షాణ కేంద్రాలను జీఎం కిషన్‌రావు శనివారం ప్రారంభించారు. గోదావరిఖనిలోనని తిలక్‌నగర్, మార్కండేయ కాలనీ, శారదానగర్‌లలో ఏర్పాటు చేసిన టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సులను అయన ప్రారంభించారు. మహిళలు వీటిని సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి పోందాలని సూచించారు. అయనతో పాటు పర్సనల్ ఏజీఎం మల్లయ్య పంతులు సేవాధ్యక్షురాలు అనసూర్య తదితరులు పోల్గోన్నారు.