వెచ్చని రక్తాన్ని ధారబోసిన…. అమరులు ఆరిపోని అగ్గిరవ్వలు

గోదావరిఖని, ఆగస్టు 1, (జనంసాక్షి) :వెచ్చటి రక్తాన్ని దారబోసి.. పీడిత ప్రజల విముక్తి కోసం, కార్మి హక్కుల కో సం అమరులైన విప్లవ కారులు ఆరిపోని అగ్గిరవ్వలని… నిషిద్ద మావోయిస్ట్‌ అనుబంధ సింగరేణి కార్మిక సమాఖ్య(సికాస) పేర్కొంది. ఈ మేరకు బుధ వారం స్థానిక ‘జనంసాక్షి’ కార్యాల యానికి సికాస సింగరేణి కమిటి సెక్రటరి జంజిపల్లి శ్రీధర్‌ పేరున ఓ పత్రికా ప్రకటన వచ్చింది. సాయుధ పోరాట మా ర్గంలో విప్లవోద్య మానికి నాంది పలికిన అమరత్వాన్ని స్మరిస్తు జరుగు తున్న అమర వీరుల వారోత్సవాన్ని స్పూర్తిదా యకంగా జరుపుకోవాలని బొగ్గు గని కార్మికులను ఆయన కోరారు. సింగరేణి ప్రాంతంలో అసువులు బాసి న సికాస అమరులను స్మరించాలని… ఉద్యమ ప్రేరణకు ఊపిరిని వ్వాలని శ్రీధర్‌ కోరా రు. నల్లా ఆదిరెడ్డి, ఎర్రంరెడ్డి సంతోష్‌రెడ్డి, శీలం నరేష్‌, పులి అంజయ్య, పెద్ది శంకర్‌ మొదలుకుని వడ్కాపురం చంద్రమౌళి, గుండేటి శంకర్‌, ఆజాద్‌ కిషన ్‌జీ… అదేవిధంగా సింగ రేణి ప్రాంతంలో కట్ల మల్లేష్‌, మాదిరెడ్డి, సమ్మి రెడ్డి,  బేద రామ స్వామి, భాస్కర్‌, రాంచందర్‌, పాల్గుణ, రఘు, జంజిపల్లి శ్రీద ర్‌, ఒడ్డెపల్లి సురేష్‌, శ్రీనివాస్‌గౌడ్‌, మంగన్న, షంషీర్‌ ఖాన్‌, అన్నపూర్ణ, జాడి పోశం, రామకృష్ణ వంటి చురుకైన నాయకులు ఉద్యమ పోరాటంలో అసువుల బాసరన్నారు. సామ్రా జ్య వాదులకు అమ్ముడు పోయిన భూర్జావ పాలకవర్గాలకు జరిగిన వ్యతిరేక పోరాటంలో ఎందరో ప్రాణతర్పణం చేశారన్నారు. పాలక వర్గాన్ని ఓడించి.. ప్రజా యుద్దా న్ని నలుమూలల విస్తరింప చేసి… గెరిల్లా యుద్దాన్ని తీవ్రతరం చేయటానికి సింగరేణి కార్మికులు నడుం బిగించాల న్నారు. అదేవిధంగా ఉత్తర తెలంగాణాకు ఉపాధి వన రుగా ఉన్న సింగరేణి పరిశ్రమ ను కాపాడు కోవడం కోసం… గోదావరి పరివా హాక ప్రాంతాన్ని బొందల గడ్డగా మారుస్తున్న ఓపెన్‌ కాస్ట్‌లకు వ్యతిరే కంగా… సింగరేణిలో ప్రైవేటీకర ణకు, యాంత్రీకరణకు వ్య తిరేకం గా అన్నిపక్షాలు పోరాడాలన్నారు. సింగ రేణి కార్మి కవర్గ హక్కుల కోసం, వారసత్వ ఉద్యో గాల కోసం, డిస్మిస్‌ కార్మి కుల కోసం, నూతన భూగర్భ గనుల కోసం, ఉపా ధి కల్పన కోసం, ఓపెన్‌ కాస్ట్‌ నిర్వాసితుల నష్టపరి హారం కోసం ప్రజా ఉద్య మాన్ని అమరవీరుల బాటలో సింగరేణి ప్రాంతంలో తీవ్రతరం చేయాల న్నారు. ముఖ్యంగా యువకులు సాయుధ పోరాటాన్ని తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. అన్నిపక్షాలు ముందుండి… అమరవీరుల వారోత్సవాన్ని విజయవంతం చేయాలని శ్రీధర్‌ కోరారు.