వేంపేట గ్రామంలో శ్రమదానం

 

మెట్‌పల్లి గ్రామీణం : మండలంలోని వేంపేట గ్రామంలో సేనాభారతి, అర్‌ఎన్‌ఎన్‌ సభ్యులు శ్రమదానం చేశారు. స్థానిక రామాలయం నుంచి పెద్దమ్మగుడి వరకు రోడ్డుకు ఇరువైపుల ఉన్న పిచ్చి మొక్కలను తోలగించారు. విజయదశమి సందర్బంగా నవరాత్రి వేడుకల కోసం అలయాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా శ్రమదానం చేపట్టీనట్లు నిర్వాహకులు తెలిపారు.