వేధింపులపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు

హైదరాబాద్‌: రెవెన్యూ ఉద్యోడులపై ఉన్నతాధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సేవల సంఘం ఆరోపించింది. జిల్లా అధికారులు తహసీల్దార్లపై అనవసరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం, పోలీసు కేసులు నమోదు చేయడం సరికాదని సంఘం అధ్యక్షుడు ఎం.శివశంకర్‌, ప్రధాన కార్యదర్శి శామ్యూల్‌, కోశాధికారి నారాయణరెడ్డి తెలిపారు. మీ సేవ కోసం ప్రతి మండలంలో ఇద్దరు కంప్యూటర్‌ ఆపరేటర్లను అదనంగా నియమించాలని జిల్లా, రెవెన్యూ డివిజన్‌ స్థాయిలో తహసీల్దార్లను నియమించాలని కోరారు. రెవెన్యూ కార్యాలయాలకు కొత్త భవనాలను నిర్మించాలని కోరారు. నెల రోజుల్లో తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే అందోళనలు చేపట్టాలని నిర్ణయించినట్లు ప్రకటించారు.