వైకాపా జలపాదయాత్రలో ఘర్షణ

ముత్తారం: కరీంనగర్‌ జిల్లా మంథని ఎత్తిపోతల పథకం పనులలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ గురువారం వైకాపా ఆధ్వర్యంలో చేపట్టిన జల పాదయాత్రలో ఉద్రిక్తత నెలకొంది. ముత్తార మండలంలోని లక్కారంలో వైకాపా జిల్లా కన్వీనర్‌ పుట్టు మధు పాదయాత్రను ప్రారంభించారు. వైకాపా నాయకులైన పుట్ట మధు, మత్తన్‌సింగ్‌, మహేందర్‌రెడ్డిలను ఆయా గ్రామాల్లో కాంగ్రెస్‌ వర్గీయులు అడుగడుగున అడ్డుకున్నారు. మంత్రి శ్రీధర్‌బాబు అభివృద్ధి చేస్తున్నా వైకాపా పాద యాత్రలు చేస్తున్నారని నిలదీశారు. దీంతో ఇరువర్గాల మధ్యా తోపులాటలు, ఘర్షణలు జరిగాయి. దీంతో పోలీసులు లాఠీఛార్జి చేసి ఇరు వర్గీయులను చెదరకొట్టారు.