వైయస్ రాజశేఖర్ రెడ్డి సేవలు రాష్ట్రానికి చిరస్మరణీయం

మునగాల, జూలై 8(జనంసాక్షి): మునగాల మండల పరిధిలోని తాడువాయి గ్రామంలో దివంగత మాజీ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 73వ జయంతి వేడుకలను శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు వట్యావుల సైదులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవరం సుధీర్ రెడ్డి, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సోమపంగు గోపి, గోవర్ధన్ చారి, కోల వెంకన్న, దేవరం అంజి రెడ్డి, ఎలగందుల ఉపేందర్, రణబోతు  గోవిందరెడ్డి, నాగార్జున బ్రహ్మచారి, దళవాయి సందీప్,  వెంకటరెడ్డి, పలువురు మహిళలు తదితరులు పాల్గొన్నారు.