శంకర్‌పల్లి ప్రాజెక్టు వద్ద టీఆర్‌ఎస్‌ ధర్నా

రంగారెడ్డి: శంకర్‌పల్లి ప్రాజెక్టుకు గ్యాస్‌ కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ ప్రాజెక్టు వద్ద టీఆర్‌ఎస్‌ ధర్నా చేపట్టింది. తెలంగాణ  ప్రాజెక్టులకు గ్యాస్‌ కేటాయించకుండా ప్రాజెక్టులకు గ్యాస్‌ కేటాయించకుండా ప్రైవేటు సంస్థలకు గ్యాస్‌ కేటాయిస్తున్నారని టీఆర్‌ఎస్‌ నేతలు మండిపడుతున్నారు. సీఎం కిరణ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ ధర్నాలో టీఆర్‌ఎస్‌  ఎమ్మెల్యే కేటీఆర్‌, నేతలు ఎ. చంద్రశేఖర్‌, డా. శ్రవణ్‌తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.