శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మృతదేహాలు

హైదరాబాద్‌: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన నలుగురు తెలుగు యువకుల మృతదేహాలు శక్రవారం తెల్లవారుజామున శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాయి. ఈనెల 10న అమెరికాలోని ఒక్లామాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అనురాగ్‌ అంతటి, రావికంటి శ్రీనివాస్‌, ఫణీంద్ర, భాస్కర్‌, జస్వంత్‌రెడ్డి దుర్మరణం చెందారు. జస్వంత్‌రెడ్డి మృతదేహాన్ని బెంగాళూరు తరలించగా… మిగిలిన నలుగురి మృతదేహాలను హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. అనురాగ్‌, శ్రీనివాస్‌, ఫణీంద్ర మృతదేహాలను వారి స్వస్థలలాకు పంపించారు. భాస్కర్‌ మృతదేహాన్ని ఉదయం 7.50 గంటలకు స్సైస్‌జెట్‌ విమానంలో విశాకకు తరలిస్తారు.