శక్తిస్థల్‌లో ప్రముఖుల నివాళి

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 31 : మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 28వ వర్ధంతి సందర్భంగా బుధవారం ఉదయం శక్తిస్థల్‌ వద్ద ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాళులర్పించారు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ శక్తిస్థల్‌ లోని ఇందిరాగాంధీ సమాధి వద్ద పుష్పగు చ్చాలు ఉంచి నివాళులర్పించారు. అలాగే ప్రధానమంత్రి మన్మోహన ్‌సింగ్‌, ఎంపి రాహుల్‌గాంధీ, కేంద్ర మంత్రులు చిరంజీవి, సర్వే సత్యనారాయణ తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌ కూడా నివాళులర్పించారు. అనంతరం వారంతా అక్కడ నిర్వహిస్తున్న సర్వ మత ప్రార్ధనల్లో పాల్గొన్నారు.