శాతావాహన వీసీకి వినతిపత్రం

గోదావరిఖని టౌన్‌, మే 26, (జనం సాక్షి):
గోదావరిఖనికి చెందిన పలు ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలు పరిమితికి మించి అడ్మిషన్లు చేస్తు న్నారని ఎన్‌ఎస్‌యూఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధీర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో శాతవాహన యూని వర్శిటీ వైస్‌ఛాన్సలర్‌కు శనివారం వినతిపత్రం అందచేశారు. డిగ్రీ కళాశాలకు అనుమతిచ్చే ఎపిఎస్‌సి, హెచ్‌ఇ, యుజిసి నామ్స్‌ ప్రకారం వాటిని తనిఖీ చేయకుండా ఇష్టానుసారంగా అడ్మిషన్లు చేసుకుంటున్న కళాశాలలపై, వాటికి సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆ వినతిపత్రంలో కోరారు. వినతిపత్రం అందచేసిన వారిలో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతారపు సురేందర్‌, సాయిని రవికిశోర్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.