శాసనసభ వాయిదా పట్ల తెదేపా, వామపక్షాల ఆందోళన

హైదరాబాద్‌: శాసనసభ సమావేశాన్ని నిర్వహించకుండా వాయిదా వేయడం పట్ల తెలుగుదేశం, వామపక్షాలు ఆందోళనకు దిగాయి. సభ వాయిదా సభ వాయిదా వేయడం పట్ల నిరసనగా వారు అసెంబ్లీ సమీపంలో రవీంద్రభారతి ఎదుట రోడ్డుపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్‌కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. మరో పక్క సభన అరాంతరంగా వాయిదా వేయడం పట్ల వైకాపా అసెంబ్లీ మూడోగేటు వద్ద నిరసన  తెలుపుతోంది.