శిలాఫలకంపై పేరు తారుమారు…

పొరపాటు జరిగిందన్న సర్పంచ్ భర్త…

గద్వాల ప్రతినిధి నవంబర్ 24(జనంసాక్షి):- గట్టు మండలం పెంచికలపాడు గ్రామంలో జరిగిన పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేయగా శిలాఫలకంపై వ్యవసాయ విస్తరణ శాఖ అధికారి ఏఈఓ పేరు తారుమారుగా రాశారు.అదేంటి అని అడిగితే అలవాటులో పొరపాటు అన్నట్టుగా ఆరగిద్ద,పెంచికలపాడు గ్రామాలలో శిలాఫలకాలు ఒకేసారి ఆర్డర్ ఇవ్వడంతో ఆరగిద్దలో పనిచేసే ఏఈఓ పేరునే పెంచికలపాడు గ్రామ శిలాఫలకానికి కూడ వేశారు అని అంటున్నారట. కాకపోతే పెంచికలపాడు ఎఇఓ వాళ్ళ నాన్న అంటే ధరూర్ మండలంలోని ఓ ప్రజాప్రతినిధికి పడదని అందుకే పెంచికలపాడు ఎఇఓ పేరు శిలాఫలకంపై పెట్టనివ్వలేదని గుసగుసలాడుకుంటున్నారు.
దీనిపై సర్పంచ్ భర్త హనుమంతు రెడ్డిని వివరణ అడుగగా పొరపాటు జరిగిందని రెండు,మూడు రోజుల్లో పేరు సరిచేసిస్తాం అని చెప్పారు…