శ్రమదానంతో మంచినీటి ట్యాంకు శుభ్రం

పరిగి : మండలం మిట్టకోడూరు గ్రామంలో మంగళవారం ఉదయం యువచైతన్య యువజన సంఘం అధ్వర్యంలో సంఘసభ్యులు శ్రమదానం చేశారు. అపరిశుభ్రంగా ఉన్న మంచినీటి ట్యాంకును శుభ్రం చేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్ష కార్యదర్శులు ప్రభాకర్‌, వీరప్ప మాట్లాడుతూ గ్రామాబివృద్ధి కార్యక్రమాల్లో తమవంతు సహయ కార్యమ్రాలు అందజేస్తామని తెలిపారు.