శ్రీవారి సేవలో రాంచరణ్‌, ఉపాసన

తిరుపతి: నూతన దంపతులు రాంచరణ్‌,ఉపాసనలతో కలిసి ఎంపీ చిరంజీవి ఇతర కుటుంబసభ్యులు  శ్రీవారిని దర్శించుకుంనేందుకు తిరపతి వచ్చారు. రాత్రికి తిరుమలలో వారు శ్రీవారిని దర్శించుకున్నారు.తిరుపతి విమానాశ్రమంలో చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్‌ను బలోపేతం చేసి విజయం దిశగా పయనించేలా కృషి చేయాలన్నారు. తిరుపతిలో అభ్యర్థి ఖరారులో జాప్యం, కలిసికట్టుగా పనిచేయకపోవటం వల్ల సానుకూల ఫలితం రాలేదన్నారు.