శ్రీశైలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

శ్రీశైలానికి ఆర్టీసీ ప్రత్యేక  బస్సులు
మహబూబ్‌నగర్‌,ఫిబ్రవరి16(జ‌నంసాక్షి
):  శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైలం పుణ్యక్షేత్రానికి జిల్లాలోని 9 ఆర్టీసీ డిపోల నుంచి ఐదు రోజుల పాటు  ప్రత్యేక బస్సులు నడిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు ఇప్పటికే ప్రత్యేక బస్సులుకిక్కిరిసిన భక్తులతో బయలు దేరాయి. 19వ తేదీ వరకు ఒక్కో డిపో నుంచి ఈ ప్రత్యేక బస్సులు నడపనున్నారు. మహబూబ్‌నగర్‌ డిపో నుంచే అత్యధికంగా ఐదు రోజుల పాటు 88 బస్సులు నడుపుతున్నారు. నాగర్‌కర్నూల్‌,అచ్చంపేట , కల్వకుర్తి, నారాయణపేట, గద్వాల, వనపర్తి, కొల్లాపూర్‌, షాద్‌నగర్‌ నుంచి ఈ బస్సులు నడుస్తున్నాయి.  ఆదివారం నుంచి ఈ ప్రత్యేక బస్సులు ప్రారంభమయ్యాయి. భక్తులు ప్రైవేటు వాహనాల్లో వెళ్లకుండా ఆర్టీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లోనే శ్రీశైలం చేరుకోవాలని ఆర్టీసీ అధికారులు  కోరారు.