శ్రీ లక్ష్మీ నగర్ కాలనీలో విగ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కాలనీవాసులు

అల్వాల్ (జనంసాక్షి) సెప్టెంబర్ 1
అల్వాల్ సర్కిల్ ఓల్డ్ ఆల్వాల్ శ్రీ లక్ష్మీ నగర్ కాలనీ ఆధ్వర్యంలో దుర్గమ్మ అమ్మవారి గుడిలో కాలనీ వాసులు ప్రతి సంవత్సరం లాగానే అత్యంత భక్తిశ్రద్ధలతో విగ్నేశ్వరుని నిలుపుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని కాలనీ అధ్యక్షులు బి నాగేశ్వరరావు పేర్కొన్నారు. విఘ్నేశ్వరుని విగ్రహ దాత శశాంక్ మున్న డొనేట్ చేయగా కాలనీవాసులందరు తొమ్మిది రోజులపాటు పూజలు చేసి అనంతరం నిమర్జనం చేయడం జరుగుతుందని కాలనీలో ప్రతిరోజు ఇద్దరు దంపతులు సాయంత్రం పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని కాలనీ అధ్యక్షులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ జనరల్ సెక్రటరీ శ్రీకాంత్ రావు, గుడి కమిటీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, సెక్రటరీ భాస్కర్ గౌడ్, కమిటీ మెంబర్ నారాయణ, సాయిరాం గౌడ్, లింగారెడ్డి, జైపాల్ రెడ్డి, రవి, శివరాజ్, నాగేశ్వరరావు, శివప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.