షాదిఖానా భూమి కబ్జా..ఫిర్యాదు చేసిన నాయకులు

share on facebook

బిచ్కుంద డిసెంబర్ 13 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలకేంద్రంలో గల మైనారిటీ షాది ఖానా కొరకు ఒక్క ఎకరం భూమి సర్వే నంబర్ 814/1 ఉంది. ఈ షాదీ ఖానా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కట్టడం జరిగింది. ప్రహారి గోడ లేకపోవుట వలన భూమిని అక్రమార్కులు అక్రమంగా కబ్జా చేస్తున్నారు. ఈ కబ్జా భూమిని పరిరక్షించాలని తెరాస సీనియర్ నాయకుడు అసద్ అలీ అధ్వర్యంలో ఎమ్మార్వోకు మెమోరండం ఇవ్వడం జరిగింది. సంబంధించిన అధికారులు వెంటనే స్పందించాలని జనం కోరుతున్నారు.

Other News

Comments are closed.