సంక్షేమ పథకాలు ప్రజలకు చేర్చడంలో సహకార సంఘాల పాత్ర కీలకం

హుజూరాబాద్‌, ఆగస్టు 11 (జనంసాక్షి) : ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చడంలో సహకార సంఘాల పాత్ర కీలకం అని కరీంనగర్‌ పార్లమెంట్‌ సభ్యుడు ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నా రు. శనివారం పట్టణంలో నూతనంగా నిర్మించిన సహకార కేంద్ర బ్యాంక్‌ భవనాన్ని పొన్నం ప్రభాకర్‌, జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌, కొండూరి రవిందర్‌రావులు ప్రారంభించారు. అంతర్జాతీయ సహకా ర సంవత్సరాన్ని పురస్కరించుకొని సహాకార రైతు అవగాహన సదస్సు ను స్థానిక సహకార బ్యాంక్‌ అవరనలో నిర్వహించారు. సభ అధ్యక్షు నిగా కరీంనగర్‌ జిల్లా సహాకార కేంద్ర బ్యాంకు అధ్యక్షులు కొండూరి రవీందర్‌రావు వ్యవహారించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సభలో పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ గతంలో సహకార సంఘాలు రుణాలు తీర్చలేని ప్రజల వద్దకు వెళ్లి బలవంతపు వసూళ్లకు పాల్పడే వారని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సహకార మరింత బలోపేతం చేసి ప్రజలకు సేవలు అందించడమే లక్ష్యంగా తీర్చిదిద్దా మన్నారు. సహకార సంఘం అంటే ప్రజల ఇంటి ముందుకు వచ్చి సేవలు అందించే విధంగా ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో కాంప్లెక్స్‌ ఎరువుల కోరత ఉంటే ఇఫ్‌కో డైరెక్టర్‌ హుస్నాబాద్‌ ఎమ్మేల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, యూరియా కోరత ఉంటే క్రిభ్‌కో డైరెక్టర్‌ పొన్నం ప్రభాకర్‌ భాద్యత వహిస్తామన్నారు. గతంలో ఎరు వుల కోసం రైతులపై లాఠీ చార్జీలు జరిగిన సంఘటనలు ఉన్నా యన్నారు. జిల్లాలో అవసరమైతే ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించడం కోసం కృషి చేస్తామన్నారు.

జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ మాట్లాడుతూ సహాకార సంఘాల ద్వారా గత సంవత్సరంలో 150 కోట్ల పంట రుణాలు అందించామన్నారు. ఈ సంవత్సరం 200 కోట్ల రుణాలు అందిం చడమే లక్ష్యంగా సహకార సంఘాలకు అదేశాలు ఇచ్చామ న్నారు. రుణాలు తీసుకున్న ప్రతి ఒక్కరు తిరిగి చెల్లించాలని సూచించారు. సకాలంలో రుణాలు చెల్లించకపోతే మిగిలిన వారికి రుణాలు అందిం చడంలో అధికారులు వెనుకాడతారన్నారు. రైతులు పంటలను అధిక దిగుబడులు సాధించే దిశగా సహకార సంఘాలు కృషి చేయాల న్నారు. 100 శాతం డిపాజిట్లను సహకార బ్యాంకుల్లో చేసి సంఘాల అభివృద్ధికి సహకరించాలన్నారు. హుస్నాబాద్‌ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి మాట్లాడుతూ జాతీయ బ్యాంకులకు దీటుగా సహాకార బ్యాంకులు పని చేస్తున్నాయాన్నారు. ప్రజల అభివృద్ధిలో సహకార సంఘాల పాత్ర కీలకం అన్నారు. స్థానిక ఎమ్మేల్యే ఈటెల రాజేెందర్‌ మాట్లాడుతూ ప్రజలకు బ్యాంకులను అందుబాటులో ఉంచేందుకు ఇందిరా గాంధీ బ్యాంకులను జాతీయం చేసిందన్నారు. రుణాలు చెల్లంచడంలో మహిళలు ముందంజలో ఉన్నారన్నారు. మోసాలకు కేంద్రాలు పట్టణాలే కాని పల్లెలు కాదన్నారు. సహాకార బ్యాంకులను గ్రామీణా ప్రజలు ఆదరించి ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ సహాకార సంఘాలు గ్రామీణా ప్రాంతాలు అభివృద్ధి చెందడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయాన్నారు. సహకార సంఘాలు అందిస్తున్న అవకాశాలను రైతులు మహిళలు సద్విని యోగం చేసుకోవాలన్నారు.

ముస్లిం కమ్యూనిటీ భవనాల నిర్మాణం కోసం నిధులు మంజూరు

జిల్లాలోని ఆరు మండలాల్లో ముస్లిం కమ్యూనిటీ భవనాల నిర్మాణం కోసం 30 లక్షల రూపాయలను ఎంపీ కోట నుంచి మంజూరు చేసి నట్లు పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. సిరిసిల్ల, హుస్నాబాద్‌, జమ్మికుం ట, వేములవాడ, మానకొండూర్‌ మండలాలకు 5 లక్షల రూపాయల చొప్పున కేటాయించినట్లు వెల్లడించారు.

జమ్మికుంటలో…

ముస్లింల అభివృద్దే నా ద్యేయం : పొన్నం

జమ్మికుంట మసీద్‌లో ఎంపీ పొన్నం ప్రభాకర్‌ శనివారం ముస్లీం సోదరులకు ఇప్తార్‌ విందు ఇచ్చాడు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లా డుతూ ముస్లిం సంక్షేమం కోసం తాను ఎంతోగాను కృషి చేస్తున్నట్లు తెలిపారు. జమ్మికుంట కొత్తపల్లి గ్రామాల్లో మసీదుల అభివృద్దికి 5 లక్షల ఊపాయలను కేటాయించినట్లు ఆయన తెలిపారు. ముస్లిం ల కు అన్ని సౌకర్యాల కల్పించడమే కాకుండా వారిని సమా జంలో ఉన్నత స్థానానికి తీసుకవెళ్ళడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. జమ్మి కుంట మసిదు అదనపు గది నిర్మాణానికి 200 బస్తాల సిమెంట్‌తో పాటు అదనపు నిధులను కూడ కేటాయిస్తానని తెలిపారు. ముసిద్‌ కమిటీి అధ్యక్షుడు ఎంఎ హుస్సేన్‌ పాషా, అనిష్‌, దేశిని కోటి, గూడెపు సారంగపాణి, రావుల సారంగపాణి, కసుబోసుల వెంకన్న, అక్బర్‌పాషా, యాంసాని రవీందర్‌, కిషన్‌, జి.రాజమౌళి, దొడ్డె రాజేందర్‌, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై ఎనగొండ, చంద్రగిరి శ్రీనివాస్‌, కొడూరి కుమారస్వామి తక్కళ్ళపల్లి రాజేశ్వర్‌రావు తదితరులు ఇప్తార్‌ విందులో పాల్గొన్నారు.

సిరిసిల్లలో…

చంద్రబాబు వందసీట్లు బీసీలకు కేటాయిస్తానన్నా

నమ్మే స్థితిలో లేరు : పొన్నం

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు బిసిలకు వంద సీట్లు ఇస్తా నని ప్రకటించినా బిసిలు నమ్మే స్థితిలో లేరని కరీంనగర్‌ ఎంపి పొన్నం ప్రభాకర్‌ ఎద్దేవా చేశారు.సిరిసిల్లలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ అధ్యక్ష పదవిని,ప్రతి పక్ష నాయకుడి పదవి అంటిపెట్టుకున్న చంద్రబాబు రెండిట్లో ఏదో ఒకటి మొదట బిసిలకు ఇచ్చి వారిపై తనకున్న ప్రేమను0 నిరూపించుకోవాలని డిమాండ్‌ చేశారు.ఆధిపత్య పోరుకోసమే విజయమ్మ సిరిసిల్లలో దీక్ష చేసిందని దీని వల్ల ఇక్కడి నేత కార్మికులకు ఒరిగింది మాత్రం ఏమిలేదని అన్నారు.ఆధిపత్య పోరుతో సాదించేది ఏమి లేదని ప్రజా సమస్యలపై దృష్టి సారిం చాలని ఆయా పార్టీలకు హితవు పలికారు.ఈ సమావేశంలో రాష్ట్ర కిసాన్‌ సెల్‌ అద్యక్షులు గడ్డం నర్సయ్య,మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సంగీతం శ్రీనివాస్‌, మండల కాంగ్రెస్‌ అద్యక్షులు వైద్య శివప్రసాద్‌ లు పాల్లొన్నారు.