సంజయ్‌దత్‌కు ప్రాణానికి ముప్పు

ముంబై, జనంసాక్షి: సంజయ్‌దత్‌కు ప్రాణానికి ముప్పు ఉందంటూ ఆర్థూరు రోడ్‌ జైలు అధికారులు ఆకాశరామన్న ఉత్తరం అందింది. సంజయ్‌ దత్‌కు అవసరమైన భద్రతా కల్పిస్తామని జైలు అధికారులు తెలిపారు. లొంగిపోయేందుకు దత్‌కు కోర్టు ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. రేపు ఆయన లొంగిపోయాల్సివుంది.