సంపులో పడి చిన్నారి మృతి
హైదరాబాద్: రామంతాపూర్ వెంకటరెడ్డినగరలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఇద్దరు చిన్నారులు సంపులో పడ్డారు. వీరిలో ఒక చిన్నారి మృతి చెందింది. మరో చిన్నారని స్థానికులు రక్షించారు. చిన్నారి మృతి చెండదంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి.



