సచివాలయంలో హోంమంత్రి సబితాతో తెలంగాణ జేఏసీ నేతల భేటీ

హైదరాబాద్‌: సచివాలయంలో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డితో తెలంగాణ జేఏసీ నేతలు భేటీ అయ్యారు. సమావేశంలో తెలంగాణ మార్చ్‌ అనుమతిపై చర్చిస్తున్నట్లు సమాచారం. మార్చ్‌ వేదిక మార్చాలని జేనసీ నేతలకు ప్రభుత్వం  సూచించింది. మార్చ్‌ వేదికను మార్చే ప్రసక్తే లేదని జేఏసీ నేతలు తేల్చిచెబుతున్నారు. ఈ సమావేశం కన్నా ముందు తెలంగాణ మంత్రులు హోంమంత్రిని కలిసి మార్చ్‌కు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.