సబితాకు ఫోన్‌ చేసిన టీ, కాంగ్రెస్‌ ఎంపీలు

హైదరాబాద్‌: తెలంగాణలో అక్రమ అరెస్టులు నిలిపివేయాలని, చెక్‌పోస్టులు ఎత్తివేయాలని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డికి తెలంగాణ, కాంగ్రెస్‌ ఎంపీలు ఫోన్‌ చేసి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌కు వచ్చే తెలంగాణవాదులకు పోలీసులు సహకరించేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. అక్రమ అరెస్టులను పరిశిలించి, చెక్‌పోస్టుల ఎత్తివేతకు మంత్రి హామీ  ఇచ్చారని ఎంపీలు తెలియజేశారు.