సబ్సిడీ గ్యాస్‌ను వ్యాపార అవసరాలకు వినియోగిస్తే కఠిన చర్యలు

ఖమ్మం, జూలై 24 : ప్రభుత్వం గృహావసరాల కోసం సబ్సిడీపై అందిస్తున్న వంటగ్యాస్‌ను వ్యాపార అవసరాలకు వినియోగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పాల్వంచ రెవెన్యూ డివిజన్‌ అధికారి శ్యాంప్రసాద్‌ హెచ్చరించారు. 14.2 కేజీల సామర్ధ్యం కలిగిన ఎల్‌టివి గ్యాస్‌ను హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, టీస్టాళ్లు, భోజన శాలలు, నర్సింగ్‌హోమ్‌లు, ప్రైవేట్‌ ఆసుపత్రులు, క్యాంటిన్లు, వ్యాపార సంస్థల అతిథి గృహాలు, టీ క్లబ్లులు, వైన్‌షాపులు, బేకరీ దుకాణాలు, పాస్ట్‌ఫుడ్‌సెంటర్లు, కల్యాణ మండపాలకు సబ్సిడీ గ్యాస్‌ను వినియోగించడం చట్టరీత్యా నేరమని, ఇలా వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.