సమయపాలన పాటించని తాసిల్దార్.

share on facebook

గంట ముందుగానే వెళ్ళిపోతున్న వైనం

భైంసా రూరల్ డిసెంబర్ 24 జనం సాక్షి

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం తాసిల్దార్ కార్యాలయం ముందు శుక్రవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. సమయపాలన పాటించటం లేదని మండిపడ్డారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శుక్రవారం సాయంత్రం 4 గంటలకి తాసిల్దార్ కార్యాలయంలో ఒక్క జూనియర్ అసిస్టెంట్ మినహా మిగతా అధికారులు అందరూ కూడా గంట ముందుగానే డ్యూటీ నుండి వెళ్లిపోయారని. తాసిల్దార్ ఎటు వెళ్లారని జూనియర్ అసిస్టెంట్ ని అడిగితే అబ్దుల్లాపూర్ లేఅవుట్ల విషయంలో వెళ్లారని చెప్పారు. వెంటనే తాసిల్దార్ కి చరవాణి ద్వారా అడిగితే కలెక్టర్ ఆఫీసులో మీటింగ్ ఉండి నేను వెళ్లిపోయానని తెలిపింది. అదేవిధంగా అబ్దుల్లాపూర్ లేఅవుట్లు తీసేయడానికి వెళ్లారని మీ జూనియర్ అసిస్టెంట్ మాట్లాడుతున్నారంటే అటు నుంచి అటే వెళ్లానని మాట్లాడారు ఇదేదో తేడాగా ఉందని వెంటనే అబ్దుల్లాపూర్ సర్పంచ్ కి చేరవాని ద్వారా సంభాషించే అడిగితే ఇటు ఎవరు రాలేదని చెప్పారు ఈ విధంగా ఉన్నత అధికారులు బైంసా డివిజన్లో సమయపాలన పాటించకుండానే డ్యూటీ నుండి వెళ్లిపోవడం జరుగుతుందని మండిపడ్డారు పక్కనే ఉన్న ఎంపీడీవో కార్యాలయంలో కూడా ఇదే తంతు అని దీనిపై దృష్టి పెట్టి అధికారులు సరైనటువంటి సమయాన్ని పాటించే విధంగా వాళ్ళ విధులు వాళ్ళు సరిగ్గా నిర్వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కోరుతున్నామన్నారు.

Other News

Comments are closed.