సమరభేరికి బయలుదేరిన కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా గులాబీ దళపతి సమరానికి సన్నద్దమై వెళ్లారు. టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేకర్‌రావు ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు సూర్యాపేటలో జరుగనున్న తెలంగాణ సమరభేరి బహిరంగ సభకు బయలుదేరారు. ఆయన ఇక్కడ తెలంగాణ భవన్ ప్రాంగణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి భారీ కాన్వాయ్‌తో సూర్యాపేట బయల్దేరారు. ఆయన వెంట టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తల వాహన శ్రేణఙ బయలుదేరింది. తెలంగాణ భవన్ వద్ద కేసీఆర్‌కు టీఆర్‌ఎస్ కార్యకర్తలు జై తెలంగాణ నినాదాలతో స్వాగతం పలికారు.



