సమైక్యవాదుల గుండెలదరాలె..

ఢిల్లీ పీఠం దద్దరిల్లాలె

మన ఆకాంక్ష ప్రపంచానికి చాటి చెబుదాం

తెలంగాణ ఎంపీలు
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 29 :
తెలంగాణ మార్చ్‌తో సీమాంధ్రుల గుండెలదరాలని.. నెక్లెస్‌ రోడ్డుపై తెలంగాణ కోసం నినదిస్తే ఢిల్లీ పీఠం దద్దరిల్లాలని తెలంగాణ ఎంపీలు పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యతిరేకులకు, సమైక్యవాదులకు కనువిప్పు కలిగించేలా మార్చ్‌ను దిగ్విజయవంతం చేద్దామని కోరారు. మార్చ్‌ను శాంతియుతంగా నిర్వహించి, తెలంగాణపై తీవ్ర వ్యతిరేకత ఉందన్న ముఖ్యమంత్రికి గుణపాఠం చెప్పాల న్నారు. మార్చ్‌తో శాంతిభద్రతలు తలెత్తుతా యన్న డీజీపీకి చెంపపెట్టు కలిగేలా, తెలంగాణ ఆకాంక్ష కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిపించేలా కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందామని తెలంగాణవాదులకు పిలుపుని చ్చారు. మార్చ్‌లో తాము కూడా స్వయంగా పాల్గొం టామని, కాంగ్రెస్‌ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. తెలంగాణ మార్చ్‌కు వేలాదిగా తరలివచ్చి ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ప్రపంచానికి చాటిచెప్పాలని పిలుపునిచ్చారు. శనివారం ఎంపీ వివేక్‌ నివాసంలో మంత్రి జానారెడ్డి, సీనియర్‌ నేత కే.కేశవరావు, టీ-ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, మందా జగన్నాథం, రాజయ్య, పొన్నం ప్రభాకర్‌, జేఏసీ నేతలు భేటీ అయ్యారు. ఆదివారం నిర్వహించ తలపెట్టిన మార్చ్‌ ఏర్పాట్లు, తెలంగాణలో కొనసాగుతున్న అరెస్టులు, బైండోవర్లు, పోలీసుల వేధింపులపై విస్తృతంగా చర్చించారు. పోలీసుల వ్యవహార శైలిపై ఈ సందర్భంగా టీ-జేఏసీ నేతలు, ఎంపీలు మండిపడ్డారు. అనుమతి ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం, పోలీసులు మార్చ్‌ను అడ్డుకునేందుకు యత్నిస్తున్నారని, ఆటంకాలు కల్పిస్తున్నారని మంత్రి జానా దృష్టికి తీసుకువచ్చారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, హైదరాబాద్‌కు వచ్చే వారిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అనుమతి ఇచ్చిన తర్వాత ఇలా ఆటంకాలు కల్పించడమేమటని ప్రశ్నించారు. దీనిపై జానా సూటిగా సమాధానం చెప్పలేదని సమాచారం. ఈ విషయాన్ని ¬ం మంత్రి సబితతోనే తేల్చుకోవాలని నిర్ణయించిన టీ-ఎంపీలు ఆమెకు ఫోన్‌లో విషయాన్ని వివరించారు. దీనిపై సబిత సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
భేటీ అనంతరం ఎంపీలు, జేఏసీ నేతలు విూడియాతో మాట్లాడారు. తెలంగాణ మార్చ్‌ ప్రజా ఉద్యమమని,
తెలంగాణవాదులు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కె.కేశవరావు పిలుపునిచ్చారు. మార్చ్‌కు అనుమతిచ్చి, అరెస్టులు చేయడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. అరెస్టులతో ప్రభుత్వం తెలంగాణవాదులను రెచ్చగొడుతోందన్నారు. ప్రభుత్వం ఇలాగేచేస్తే.. శాంతియుతంగా నిర్వహించే కార్యక్రమానికి విఘాతం కలుగుతుందన్నారు. అరెస్టునలు ఆపాలని ¬ంమంత్రిని కోరామన్నారు. ఉస్మానియా విద్యార్థులను అడ్డుకోవద్దని ప్రభుత్వాన్ని కోరారు. ఓయూలో అదనపు బలగాలను వెంటనే వెనక్కు రప్పించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ శక్తిని చూపించే తరణం వచ్చిందని ఎంపీ మందా జగన్నాథం అన్నారు. తెలంగాణవాదం లేదని చూపేందుకు కుట్ర జరుగుతోందని, దాన్ని తిప్పికొట్టి మార్చ్‌ను దిగ్విజయవంతం చేసుకుందామని పిలుపునిచ్చారు. మార్చ్‌కు అనుమతిచ్చి, అడ్డంకులు సృష్టించడం సరైంది కాదన్నారు. జిల్లాల నుంచి వస్తున్న వారిని అడ్డుకోవద్దని ఆయన పోలీసులను కోరారు. తెలంగాణ మార్చ్‌ ఒక పవిత్ర యుద్ధమని, శాంతియుతంగా నిర్వహించుకుందామని రాజయ్య అన్నారు. తెలంగాణవాదులుంతా స్వీయ నియంత్రణతో మార్చ్‌లో పాల్గొనాలని, క్రమశిక్షణతో వ్యవహరించిన విజయవంతం చేయాలని మార్చ్‌ను విజ్ఞప్తి చేశారు. లక్షలాదిగా తెలంగాణవాదులు తరలివచ్చి తెలంగాణ ఆకాంక్షను కేంద్ర ప్రభుత్వానికి చాటాలని ఎంపీ వివేక్‌ పిలుపునిచ్చారు. తెలంగాణకు 90 శాతం మంది వ్యతిరేకిస్తున్నారన్న ముఖ్యమంత్రికి కనువిప్పు కలిగేలా, తెలంగాణ వ్యతిరేకులకు గుణపాఠం చెప్పేలా మార్చ్‌ను నిర్వహించుకుందామన్నారు. సమైక్యవాదులకు చెంపపెట్టుగా మార్చ్‌ను విజయవంతం చేసుకుందామని పొన్నం ప్రభాకర్‌ పిలుపునిచ్చారు.