సరబ్‌ జిత్‌ విడుదలకు పాక్‌ ప్రజలు తోడ్పడాలి

సల్మాన్‌ ఖాన్‌
ముంబయి: పాకిస్థాన్‌లో మరణ శిక్ష ఎదుర్కొంటున్న భారత ఖైదీ సరబ్‌జిత్‌ సింగ్‌ను విడుదల చేయాలని పాక్‌ ప్రభుత్వాన్ని, అధ్యక్షుడు ఆసిఫ్‌ అలీ జర్దారీని బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ విజ్ఞప్తి చేశారు. ఆయన విడుదలకు పాక్‌ ప్రజలు, మీడియా కూడా తోడ్పడాలని కోరారు.మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ‘ట్విటర్‌’లో సల్మాన్‌ తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. 1990 పంజాబ్‌ (పాక్‌) వరుస పేలుళ్ల కేసులో సరబ్‌జిత్‌కు మరణ శిక్ష పడింది. ఆయన రెండు దశాబ్దాలకు పైగా అక్కడ జైల్లో ఉన్నారు.