సాంకేతిక లోపంతో నిలిచిన పల్నాడు ఎక్స్‌ప్రెస్‌

నల్గొండ: పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ రైలు ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో నల్గొండ రైల్వేస్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేసి అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. గంటకుపైగా రైలును నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.