సాంకేతిక లోపంతో నిలిచిన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌

తాండూరు : సికింద్రాబాద్‌ నుంచి వెళ్లే శతాబ్బి ఎక్స్‌ప్రెస్‌ సాంకేతిక లోపం కారణంగా రంగారెడ్డి జిల్లా తాండూరు మండలం నారాయణపూర్‌ వద్ద నిలిచిపోయింది. అంతకుముందు ధారూర్‌ స్టేషన్‌ వద్ద నిలిచిపోగా అక్కడి నుంచి తాత్కాలిక మరమ్మతులు చేసి నారాయణపూర్‌ వరకు నడిపించారు. ప్రస్తుతం నిలిచిపోయిన నారాయణపూర్‌ దగ్గర రైలుకు మరమ్మతులు చేస్తున్నారు. శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ అంతరాయం కారణంగా హైదరాబాద్‌ నుంచి ముంబయి వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైలు తాండూరు స్టేషన్‌లోనే నిలిచిపోయింది. దీంతో రెండు రైళ్లలో వెళుతున్న ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు.