‘సాండి ‘ భయంతో అగ్రరాజ్యం గజ..గజ

వేలాది విమానాల ర ద్దు
నిలిచిపోయిన రైళ్లు..స్తంభించిన జనజీవనం
న్యూయార్క్‌ స్టాక్‌ మార్కెట్‌ తాళం
అప్రమత్తమైన అమెరికా
వాషింగ్టన్‌, అక్టోబర్‌ 29 (జనంసాక్షి):
భీకర తుపాను ”సాండ్ణీ అగ్రరాజ్యం అమెరికాను వణికిస్తోంది. కొన్ని దశాబ్దాల తర్వాత ”సాండ్ణీ హరికేన్‌ అమెరికా వెన్నులో భయం పుట్టించింది. తుపాను దాటికి ప్రఖ్యాత నగరాలు న్యూయ్కాం, వాషింగ్టన్‌, బోస్టన్‌ తదితర ప్రాంతాలు గజగజ వణుకుతున్నాయి. విపరీతమైన వాన, మంచు ఆయా నగరాలను ముంచెత్తుతోంది. మరోవైపు, వేలాది మంది ప్రజలను ఇళ్లను వదిలి పునరావాస శిబిరాలకు తరలివెళ్లారు. సోమవారం రాత్రికి న్యూయ్కాం, న్యూజెర్సీ ప్రాంతాలను తుపాను తాకనుందన్న వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అధ్యక్షుడు బరాచీ ఒబామా పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే కొలండియా, మసాకశాట్స్‌, న్యూయ్కాం తదితర ప్రాంతాల్లో ఎమర్జెన్సీ విధించారు. లోతట్టు, తీర ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించాలని గవర్నర్లను ఆదేశించారు. న్యూయ్కాం నగరంలోని తీర ప్రాంతాల నుంచి 3.75 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు ఆదేశించారు. 76 ప్రభుత్వ పాఠశాలల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంతో ప్రజలంతా ఆయా కేంద్రాలకు తరలివెళ్తున్నారు. తుపాన్‌ ప్రభావంతో న్యూయ్కాంలోని అన్ని ప్రాంతాల్లో
విద్యాసంస్థలకు ముందస్తుగా సెలవు ప్రకటించారు. తూర్పుతీర ప్రాంతాల నుంచి 7,400 విమాన సర్వీసులను రద్దు చేశారు. రోడ్డు రవాణపై కూడా ఆంక్షలు విధించారు. వాషింగ్టన్‌, ఫిలిడేల్ఫియా, న్యూయ్కాంలలో బస్సు, రైలు సర్వీసులను రద్దు చేశారు. మరోవైపు, న్యూయ్కాం స్టాచీ మార్కెట్‌కు సెలవు ప్రకటించారు. మంగళవారం కూడా తెరిచే అవకాశాల్లేవని మార్కెట్‌ అధికారులు తెలిపారు. 9/11 దాడుల తర్వాత న్యూయ్కాం స్టాచీ మార్కెట్‌ను మూసివేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. అటు ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో జరగాల్సిన అన్ని సమావేశాలు రద్దయ్యాయి. మరోవైపు అధికార యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లు చేపట్టింది. ఉత్పాతం వల్ల ఎదురయ్యే సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రూపొందించింది. ”న్యూయ్కాం ప్రజల రక్షణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. ఆ ప్రణాళికను సరిగ్గా అమలు చేస్తే.. ఈ ఉత్పాతం నుంచి సురక్షితంగా బయటపడవచ్చు. లేదంటే ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది. ప్రతి ఒక్కరూ ఎవరికి వారుగా అప్రమత్తంగా ఉండాల్ణి అని న్యూయ్కాం మేయం మైకేల్‌ బ్లూమ్‌బ్గం తెలిపారు. సాండీ వల్ల విద్యు’ సరఫరాకు తీవ్ర ఆటంకం కలిగే అవకాశం ఉందని యూటిలిటీ కంపెనీలు హెచ్చరించాయి. దాదాపు 5-7 రోజుల పాటు విద్యు’ సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉందని, ప్రజలంతా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించాయి. నీరు, ఆహార పదార్థాలు, జెనరేటర్లు, బ్యాటరీలు, ఇతర నిత్యావసర వస్తువులన్నీ సిద్ధంగా ఉంచుకోవాలని పేర్కొన్నాయి. తుపాను ప్రభావం అధ్యక్ష ఎన్నికలపై ప్రభావం చూపింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రచారం చేసేందుకు బరాచీ ఒబామా, రోవ్నిూ తమ వర్జినియా పర్యటనలను రద్దు చేసుకున్నారు. సాండీ తుపానుతో పరిస్థితి సీరియస్‌గా ఉంటుందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఒబామా ఆదేశించారు. రాబోయే రోజుల్లో ఎలా వ్యవహరించాలనే దానిపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇదిలా ఉంటే, సాండీ నేపథ్యంలో వాషింగ్టన్‌, న్యూయ్కాంలలోని భారత ఎంబసీలనను మూసివేశారు.