సామ్రాజ్యవాదుల దోపిడీని ఆరికట్టాలి
హైదరాబాద్: సామ్రాజ్యవాదులు దేశాలను రెచ్చగొడుతూ దేశాల మధ్య చిచ్చుపెడుతూ అణుయుద్దాలతో భూతలాన్ని నాశనం చేస్తున్నారని అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. సామ్రాజ్యవాదులు చేసే వనరుల దోపిడీకి, దేశాల మధ్య అసమానతలు రూపుమాపడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని హైదరాబాదులో జరిగిన 20వ మహాసభలో ఆ సంఘం నేతలు పిలుపు నిచ్చారు. దేశాలమధ్య స్నేహసంబంధాలు పెంపోందించాలని, శ్వేత జాతి దురహంకా రానికి వ్యతిరేకంగా పోరాడాలని సూచించారు. రాజకీయ, ఆర్థిక, విద్య, మీడియా, సాంస్కృతిక రంగాలపై నిలదీయాలన్నారు. అలాగే భారత్‌లో ఎఫ్‌డీఐలను వ్యతిరేకిస్తూ చేపట్టే ఉద్యమానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు.



