సారయ్య ఇంటికి ముట్టడించిన టీఆర్‌ఎస్‌వీ

వరంగల్‌: ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా వరంగల్‌లో మంత్రి సారయ్య ఇంటిని టీఆర్‌ఎస్‌వీ విద్యార్థి సంఘం ముట్టడించింది. అర్హలందరికీ ఫీజు రీయంబర్స్‌మెంట్‌ చేయాలని విద్యార్థులు నినాదాలు చేశారు. విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.