సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ హవా

గోదావరిఖని – సింగరేణి గుర్తింపు కార్మిక సంఘానికి గురువారం జరిగిన ఎన్నికల్లో తొలి ఫలితాన్ని ఏఐటీయూసీ నమోదు చేసుకున్నది. ఖమ్మం జిల్లా ఇల్లెందులో ఏఐటీయూసీ విజయం సాధించింది. హవా కొనసాగ ఫలితాలు వెల్లడయ్యాయి. గురువారం రాత్రి కడపటి వార్తలు అందేసరికి 11ఏరియాల్లో నాలుగు ఏరియాల ఫలితాలు వెల్లడయ్యాయి. ఇల్లందు రీజియన్‌లో ఐఎన్‌టీయూసీ పై ఏఐటీయూసీ 575 ఓట్లతో విజయం సాధించగా, హైదరాబాద్‌ కార్పొరేట్‌లో ఏఐటీయూసీపై ఐఎన్‌టీయూసీ విజయం సాధించింది. కొత్తగూడెం ప్రధాన కార్యాలయంలో టీబీజీకేయస్‌పై 174ఓట్లతో ఐఎన్‌టీయూసీి గెలుపొందింది. అలాగే మందమర్రి రీజియన్‌లో ఏఐటీయూసీ పై 718 ఓట్లతో టీబీజీకేఎస్‌ విజయం సాధించగా, బెల్లంపల్లి రీజియన్‌లో టీబీజీకేఎస్‌ పై 43 ఓట్ల ఆధిక్యంతో ఏఐటీయూసీ గెలుపొందింది. మిగిలిన భూపాలపల్లి మణుగూరు కొత్తగూడెం, ఆర్జీ1, ఆర్జీ2, ఆర్జీ3 శ్రీరాంపూర్‌ల్లో లెక్కింపు ఇంకా కొనసాగుతోంది.