సిటి బస్సులో పయనిస్తా
సిటీబ్యూరో, జనంసాక్షి: ఆర్‌టీసీ గ్రేటర్ జోన్‌ను సంస్థ ఎండీ ఏకే దత్తత తీసుకున్నారు. ఇక్కడి పనితీరును మెరుగుపర్చి లాభాలబాటలో నడిపేందుకు ప్రత్యేక్ష కార్యచరణకు శ్రీకారం చుట్టారు. గ్రేటర్ ఆర్‌టీసీ సమస్యలపై మంగళవారం ఆయన బస్‌భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఇక నుంచి తాను క్రమం తప్పకుండా నగరంలో పర్యటిస్తానని వెల్లడించారు. ఇటీ బస్సులలో పయనించి అధికారులు, కండక్టర్లు, డ్రైవర్ల పని తీరును పరిశీలిస్తానన్నారు. అందరం కలిసి మంచి ఫలితాలను సాధిద్ధామని సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్‌లోనే జోన్ రూ. మూడు కోట్ల లాభాలు గడించడంపై సంతృప్తిని వ్యక్తం చేశారు. అధికారుల కృషిని అభినందించారు. ఈడీ ఎ. కోటేశ్వర్‌రావు మాట్లాడుతూ గత ఏడాది కంటే నష్టాలు తగ్గాయని పేర్కొన్నారు. మమావేశంలో సికింద్రాబాద్ రీజనల్ మేనేజర్ సత్యనారాయణ , హైదరాబాద్ రీజనల్ మేనేజర్ ఎస్‌వీ రావు , పలువురు డిపో మేనేజర్లు పాల్గొన్నారు.
నగరంలో నేడు
సర్ ఆర్ధర్ కాటన్
211వ జయంతి ఉత్సవాలు
ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్,
సాయంత్రం 5.30 గంటలకు
గురుప్రసాద్ విశిష్ట ప్రతిభా
పురస్కారాల విద్యాభవన్, కింగ్ కోఠీ
సాయంత్రం 5.30 గంటలకు
ధ్వన్యనుకరణ మహూత్సవాలు
మిమిక్రీ ఆర్టీస్ట్స్ వెల్‌ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
రవీంద్రభారతి ఘంటసాల ప్రాంగణం, సాయంత్రం 6గంటలకు
ఆదిశంకరాచార్య జయంతి వేడులు
త్యాగరాయగానసభ, సా . 6గంటలకు
జీవీఆర్ ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ టీవీ పురస్కారాల ప్రదానోత్సవం
రవీంద్రభారతి, సా. 6.15 గంటలకు
అన్నమయ్య సంకీర్తనా సౌరభం
త్యాగరాయగానసభ,
సా. 6.15గంటలకు


