సిద్ధి వినాయక భక్తమండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

 

దండేపల్లి జనం సాక్షి సెప్టెంబర్ 01నవరాత్రులలో భాగంగా దండేపల్లి మండల కేంద్రంలో గురువారం శ్రీ సిద్ధి వినాయక భక్తమండలి ఆధ్వర్యంలో మొదటి రోజు అన్నదానాన్ని స్థానిక ఎంపీటీసీ ముత్యాల శ్రీనివాస్ ప్రారంభించారు గణపతి మండపం వద్ద భజన కార్యక్రమంలో పాల్గొని అనంతరం వచ్చిన భక్తులకు ఆయన అన్నదానాన్ని నిర్వహించారు స్థానిక ఎస్సై సాంబ మూర్తి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ గణపతి మండపం వద్ద ఎలాంటి అవాంఛనీయ కార్యక్రమాలు చేయవద్దని యువకులకు సూచించారు సౌండ్ సిస్టం పేకాట నిషేధిత వస్తువులను మండపం వద్దకు తీసుకురావద్దని అన్నారు ఒకవేళ అలాంటి అవాంఛనాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు అని సూచించారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు చీరల వెంకటేశ్వర్లు పి ఎస్ ఎస్ చైర్మన్ కాసానగొట్టు లింగన్న యువకులు మల్క నాగరాజు గరిగే లింగన్న గొట్ల అశోక్ యువకులు మహిళలు పాల్గొన్నారు