సీఎంతో తెలంగాణ మంత్రుల భేటీ
హైదరాబాద్: తెలంగాణ మార్చ్ అంశంపపై చర్చించేందుకు తెలంగాణ మంత్రులు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో భేటీ అయ్యారు. 30న జరగబోయే కవాతుకు అనుమతి అంశానికి సంబంధించి మంత్రులు ఈ భేటీలో ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయనున్నారు. నిన్న ఉదయం సమావేశమైన మంత్రులు ప్రభుత్వాన్ని ఒప్పించి కవాతుకు అనుమతి సాధించాలనే నిర్ణయానికి వచ్చారు.