సీఎంను కలిసిన తెరాస ఎమ్మెల్యేల బృందం

హైదరాబాద్‌: తెరాస శాసనసభ్యులు ఈ రోజు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిశారు. నియోజకవర్గ అభివృద్ధి నిధులను రూ. కోటి నుంచి 2 కోట్లకు పెంచాలని కోరారు. కాలుష్య నియంత్రణ మండలిలో ఒప్పంద కార్మికులపై వేధింపులు ఆపాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు. ఖమ్మం, వరంగల్‌ జిల్లాలను నీలం తుపాను నష్టం జాబితాలో చేర్చాలని ముఖ్యమంత్రికి వినతి పత్రం ఆందజేశారు.