సీఎం క్రీడలకు ఏమీ చేయడంలేదు: ఈటెల

హైదరాబాద్‌: 610జీవోతో సహా ఏ జీవోనైనా పరిస్థితుల్ని బట్టి మార్చుకోవాల్సిన అవసరం ఉంటుందని తెరాస శాసన సభ ఈటెల రాజేందర్‌ అభిప్రాయపడ్డారు. ఇరోజు తెలంగాణ భవన్‌లో తెలంగాణ వ్యాయామ ఉపాధ్యాయ సన్మానోత్సవ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వం విద్యా సెస్సు వసూలు చేస్తున్నా పేదలకు నాణ్యమైన విద్యాను అందించలేకపోతోందని ఆయన విమర్శించారు. తాను క్రీడాకారుడిని అని చెప్పుకునే సీఎం క్రీడలకు ఏమీ చేయడంలేదన్నారు.