సీఎం తెలంగాణ ప్రజలకు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు: పొన్నం

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కరిణ్‌కుమార్‌ రెడ్డిపై కనీంగన్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీని సమన్వయం చేయాల్సిన సీఎం తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని, ముఖ్మమంత్రి పదవికి ఆయన అనర్హుడని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు, ప్రజాప్రతినిధులకు సీఎంపై విశ్వాసం లేదని, అసలు ఇంత జరుగుతోంటే తెలంగాణ మంత్రులను పిలిచి మాట్లాడారా అని ఆయన ప్రశ్నించారు. పార్టీలని ధిక్కరించేవారి చెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేవారి మాటలను అధిష్ఠానం నమ్మడం దురదృష్ణకరమని పొన్నం అన్నారు.