సీఎం పర్యటన సందర్భంగా జేఏసీ నేతల అరెస్ట్‌

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇందరమ్మబాట సందర్భంగా రంగారెడ్డి జిల్లాలో పలువురు జేఏసీ నాయకులను, టీఆర్‌ఎస్‌ నాయకులను, విద్యార్థులను అరెస్టు చేశారు. సెమిస్టార్‌ పరీక్షలు ఉన్నాయన్నా వినకుండా పోలీసులు అత్యుత్సాహంతో విద్యార్థులను అరెస్టు చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.