సీఎం మాటల్లో నిజం లేదు

హైదరాబాద్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా ఎడారిగా మారుతుందన్న ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు సత్యదూరమని తెరాస సీనియర్‌ నేత వినోద్‌ అన్నారు. గదావరి నీళ్లు మహబూబ్‌నగర్‌కు ఎలా మళ్లిస్తారో అర్థం కావడం లేదన్నారు. ప్రాణహిత ద్వారా 350 టీఎంసీలు ఇంద్రాపతి ద్వారా 300 టీఎంసీల నీరు గోదావరిలో చేరుతుందని వినోద్‌ చెప్పారు. ఈ జలాలు కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల గుండా సముద్రంలో కలుస్తున్నాయాని వివరించారు. కాంతనపల్లిలో ప్రజెక్టు నిర్మించకపోవడం వల్ల ఈ నీరంతా వృధాగా పోతోందన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల 8 లక్షల ఆయకట్టుకు నీరు ఇవ్వవచ్చని చెప్పారు. పోలవరం కట్టకపోతే గోదావరి నీరు వృధా అవుతుందని చెప్తున్న సీఎం కాంతనపల్లి విషయంలో ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు.