సీఐటీయూ రాష్ట్ర 13వ మహాసభలను జయప్రదం చేయాలి

హైదరాబాద్‌:  సీఐటీయూ రాష్ట్ర 13వ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ ఇవాళ సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లి సిక్‌ విలేజ్‌ నుంచి జీపు యాత్ర ప్రారంభించారు. జూలై 5నుంచి 8 వరకు  జరిగే మహాసభలను జయప్రదం చేయాలని జంటనగరాల్లో ఈ జీపుయాత్రను చేపట్టినట్లు సీఐటీయూ నాయకుడు నర్సింహారెడ్డి తెలియజేశారు. కార్మికులకు జరుగుతున్న అన్యాయాలు, అధిక ధరలు, ఇతరత్రా సమస్యల గురించి సీఐటీయూ పలు ఉద్యమాలు చేపట్టిందని ఆయన గుర్తుచేశారు.