సీపీడీసీఎల్‌కు అవార్డు
హైదరాబాద్: విద్యుత్ ప్రసారంలో నష్టాలను తగ్గించినందుకు సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (సీపీడీసీఎల్)కు అవార్డు లభించింది. ఓవరాల్ డిస్ట్రిబ్యూషన్ యుటిలిటి విభాగంలో ఈ అవార్డును ప్రకటించారు. రేపు దేశరాజధానిలో కౌన్సిల్ ఆప్ పవర్ యుటిలీటీ నుంచి సీపీడీసీఎల్ సీఎండీ అనంతరామ్ అవార్డును స్వీకరించనున్నారు.



