సీపీడీసీఎల్‌ సీఎండీతో చిన్నపరిశ్రమల అసోసియేషన్‌ నేతల భేటీ

హైదరాబాద్‌: సీపీడీసీఎల్‌ సీఎండీ అనంతరాముతో చిన్నపరిశ్రమల అసోసియేషన్‌ నేతలు నేడు భేటీ అయ్యారు. విద్యుత్‌ సరఫరా చేయకపోతే పరిశ్రమలు మూసివేస్తామని, ఆందోళన చేస్తామని చిన్న పరిశ్రమల అసోసియేషన్‌ ఆయనకు తెలియజేసింది. రెండ్రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని చిన్న పరిశ్రమల అసోసియేషన్‌ నేతలకు సీపీడీసీఎల్‌ సీఎండీ అనంతరాము హామీ ఇచ్చారు.