సీబీఐ వలలో ఆర్మీ ఇంజినీర్‌

హైదరాబాద్‌: హకీంపేట ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో ఆర్మీ ఇంజినీర్‌ రవిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. కాంట్రాక్టర్‌ నుంచి రూ. లక్ష తీసుకుంటుండగా రవిని సీబీఐ అధికారులు పట్టుకున్నారు. కాంట్రాక్టర్‌ నుంచి రూ. 20 లక్షలు డిమాండ్‌ చేసినట్లు తెలిసింది. రవి నివాసంలో సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం తెలిసింది.