సీమాంధ్ర సీఎం కాబట్టే

తెలంగాణ ‘జైపాల్‌’ను విమర్శిస్తున్నారు
ఎంపీలు పొన్నం, వివేక్‌ ఆగ్రహం
హైద్రాబాద్‌,ఆగస్టు 13 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై టీ కాంగ్రెస్‌ ఎంపీలు మండిపడ్డారు. గ్యాస్‌ కేటాయించడంలో పట్టించుకోవడం లేదం టూ సీఎం కిరణ్‌ జైపాల్‌పై చేసిన వ్యాఖ్యలను టీ కాంగ్రెస్‌ ఎంపీలు పొన్నం ప్రభాకర్‌, వివేక్‌ తిప్పికొట్టారు. కిరణ్‌ కేవలం సీమాంధ్రకే సీఎంలా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్రంలోని విద్యుత్‌ ప్రాజెక్ట్‌లు పూర్తి చేయ కుండా గ్యాస్‌ కేటాయించాలనడం అస మం జసమన్నారు. జైపాల్‌రెడ్డిపైఆయన చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని, తెలంగాణ అభివృద్ధికి చిత్తశుద్ధితో జైపాల్‌ కృషి చేస్తున్నారన్నారు. ఆయనపై ఆరోపణలు కేవలం కుట్రపూరితమైనవిగా అభివర్ణించారు. జైపాల్‌రెడ్డిపై సీఎం కుట్రపూరితంగా ఆరోపణలు చేస్తున్నారని గతంలో చెప్పామని గుర్తుచేశారు. ప్రైవేటు ప్రాజెక్ట్‌ల, రాజకీయ లబ్దికోసమే సీఎం ఈ ఆరోపణలు చేస్తున్నాడని వారు మండిపడ్డారు.