సీసీ రోడ్లతో పట్టణం సస్యశ్యామలం

 మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూపరాణి
చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 02 : సీసీ రోడ్ల నిర్మాణంతో పట్టణం సస్యశ్యామలమవుతుందని మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూపరాణి-శ్రీధర్ రెడ్డి అన్నారు. శుక్రవారం చేర్యాల మున్సిపల్ పరిధిలోని 70 లక్షల రూపాయల విలువతో మంజూరైన సీసీ రోడ్ల ప్రారంభంలో భాగంగా 12వ వార్డులో 6 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకు స్థానిక కౌన్సిలర్ పచ్ఛిమడ్ల సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో చైర్పర్సన్ చేతుల మీదుగా భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మంగోలు చంటి, కౌన్సిలర్ ఆడెపు నరేందర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పూర్మ వెంకట్ రెడ్డి ,టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ముస్త్యాల నాగేశ్వరరావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ముస్త్యాల బాల్ నర్సయ్య, కొమురవేల్లి దేవస్థాన మాజీ చైర్మన్ ముస్త్యాల కిష్టయ్య, బురగొని తిరుపతి గౌడ్,ఎర్రోళ్ల రాంచంద్రం, గోనె హరి, యాట యాదగిరి,మంచాల కొండయ్య,ఎండి. ఎక్బాల్, మల్లిగారి నర్సింహులు, తుమ్మలపల్లి సంజీవులు తదితరులు పాల్గొన్నారు.