సుప్రీంలో జగన్‌ బెయిల్‌ పిటషన్‌

న్యూఢిల్లీ: అక్రమాస్తుల కేసులో నిందితుడు, కడప ఎంపీ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ నమోదైంది. నిందితుడు జైలో ఉన్నందున ఆయన తరపు న్యాయవాదులు జగన్‌కు బెయిల్‌ ఇవ్వాలని ఈ రోజు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జగన్‌ సీబీఐ అధికారుల విచారణకు సంపూర్ణంగా సహకరిస్తున్నందున ఆయనకు బెయిల్‌ ఇవ్వాలని పిటిషన్‌లో తెలియజేశారు.