సుప్రీం ఆదేశాలతో ఢల్లీి సర్కార్ దిద్దుబాటు
ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్ హోమ్ సౌకర్యంవారాంతపు లాక్డౌన్ చేపట్టనున్నట్లు ప్రకటన
న్యూఢల్లీి,నవంబర్16(జనం సాక్షి ):
యరాజధాని ఢల్లీిలో వాతావరణ కాలుష్య తీవ్రతను సుప్రీంకోర్టు సీరియస్‌గా తీసుకున్న నేపథ్యంలో ఢల్లీి సర్కార్ వేగంగా చర్యలకు ఉపక్రమించింది. సంక్షోభాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు పలు అత్యవసర చర్యలు ప్రకటించింది. వారాంతపు లాక్‌డౌన్‌కు, ప్రభుత్వ ఉద్యోగులకు వారం రోజుల పాటు వర్క్‌ఫ్రమ్ హోమ్ కల్పించనున్నట్లు ఢల్లీి ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఢల్లీిలో తీవ్రమౌతున్న వాయు కాలుష్యాన్ని నివారించేందుకు తక్షణం చర్యలు చేపట్టాలంటూ సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఢల్లీి, కేంద్ర ప్రభుత్వం, పంజాబ్, హరియాణ, ఉత్తరప్రదేశ్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని పరిశీలించాలని అత్యున్నత న్యాయస్థానం సూచిస్తూ.. కేంద్రం ఆధ్వర్యంలో రాష్టాల్ర చీఫ్ సెక్రటరీలు మంగళవారం భేటీ అయి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలని పేర్కొంది. తదుపరి విచారణ నవంబర్ 17వ తేదీకి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఢల్లీి ప్రభుత్వం సమావేశమైందని, వారాంతపు లాక్డౌన్ విధించేందుకు సిద్ధంగా ఉన్నామని ఢల్లీి మంత్రి గోపాల్ రాజ్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రైవేట్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్‌ను అనుమతించాలని సూచించినట్లు తెలిపారు. ఇప్పటికే ఢల్లీిలోని పాఠశాలలను వారం రోజుల పాటు మూసివేస్తున్నట్లు కేజీవ్రాల్ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే రాష్ట్రంలో భవన నిర్మాణ పనులతో పాటు పారిశ్రామిక కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించింది. కాగా, పొరుగు రాష్టాలైన్ర హర్యానా, పంజాబ్‌లలో పంట వ్యర్థాలను తగుల బెట్టడంతో ఢల్లీితో పాటు రాజధాని పరిధిలోని ప్రాంతాల్లో వాయు కాలుష్యం పెరుగుతోందన్న ఢల్లీి ప్రభుత్వ వాదనను కోర్టు తోసిపుచ్చింది. వాయు కాలుష్యంలో పంట వ్యర్థాలను తగుల బెట్టడంతో ఏర్పడే కాలుష్యం కేవలం 4 శాతం మాత్రమే ఉందని కోర్టు పేర్కొంది. ’ఇలాంటి కుంటి సాకులు చెబితే విూరు ఆర్జిస్తున్న ఆదాయం.. పాపులర్ స్లోగన్లపై ఎంత వెచ్చిస్తున్నారో ఆడిట్ చేయాల్సి ఉంటుంది’ అని హెచ్చరించింది. కాగా, సోమవారం ఢల్లీిలో గాలి నాణ్యత సూచిక 343గా ఉంది. గాలి నాణ్యత చాలా పేలవంగా ఉన్నట్లని, ఇది దీర్ఘకాలం కొనసాగితే శ్వాసకోశ వ్యాధులు తీవ్రమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.సిటీలో స్కూళ్లు మూసివేత, నిర్మాణ పనులపై నిషేధం, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటు ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయడం సహా పలు చర్యలు ప్రకటించింది. పర్యావరణ ముఖ్యమంత్రి గోపాల్ రాయ్ మంగళవారంనాడు విూడియాతో మాట్లాడుతూ, వాహన కాలుష్యాన్ని నివారించేందుకు చేపట్టిన ’రెడ్ లైట్ ఆన్, గడాఫీ ఆఫ్’ ప్రచారం ఈనెల 18తో పూర్తి కానున్నందున దీనిని మరో 15 రోజులు పొడిగిస్తున్నట్టు చెప్పారు. సెకెండ్ ఫేజ్ నవంబర్ 19 నుంచి డిసెంబర్ 3 వరకూ కొనసాగుతుందన్నారు. పంజాబ్, హర్యానా, యూపీ, ఢల్లీి ప్రభుత్వ అధికారులతో ఈరోజు సమావేశం జరిగిందని, ఎన్సీఆర్లో వర్క్ ఫ్రమ్ హోం అమలు చేయాలని, నిర్మాణ పనులు నిషేధించాలని, పరిశ్రమలను కూడా (ఎన్సీఆర్లో) మూసేయాలని సమావేశంలో ప్రతిపాదించామని మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. కాలుష్య సంక్షోభంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఇటీవల సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు సంధించిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రజలు ఎలా బతకాలి? రెండ్రోజుల లాక్డౌన్ అమలు చేసే ఆలోచన కానీ, ప్రత్నామ్నాయ ఆలోచనలు కానీ ఏమైనా చేస్తున్నారా?‘ అని సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్రాన్ని నిలదీసింది. వ్యర్థ పదార్దాలను తగులబెట్టే మిషన్లు రైతులకు ఎందుకు సమకూర్చకూడదని కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ధర్మాసనం ప్రశ్నించింది.