సూర్యప్రభ వాహనంపై కోదండరాముని వైభవం

తిరుపతి : శ్రీ కోదండ రామ స్వామి ఆలయంలో వార్షిక బ్రహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.ఉత్సవాల ఏడు రోజు నేడు స్వామి సూర్యప్రభ వాహనంపై వైరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంతో తితిదే అధికారులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.